close

సోమవారం, ఫిబ్రవరి 24, 2020

ప్రధానాంశాలు

ఉత్తమ సేవలకు పతకాలు

ఇద్దరు నగర పోలీసు అధికారులకు ఇండియన్‌ పోలీస్‌ మెడళ్లు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సేవలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందించే ఇండియన్‌ పోలీసు పతకానికి నగరానికి చెందిన ఇద్దరు అధికారులు ఎంపికయ్యారు. వీరిలో పశ్చిమ మండల అదనపు డీసీపీ మహ్మద్‌ ఇక్బాల్‌ సిద్దికీ, డీఎస్‌పీ (సీఐడీ) డి.ప్రతాప్‌ ఉన్నారు.

కచ్చిత నివేదికల సిద్దికీ..
ఇండియన్‌ పోలీసు పతకానికి నగరానికి చెందిన పశ్చిమ మండల అదనపు డీసీపీ మహ్మద్‌ ఇక్బాల్‌ సిద్దికీ ఎంపికయ్యారు. 1989 బ్యాచ్‌కు చెందిన సిద్దికీ గతంలో కొసావోలో యూఎన్‌ శాంతిభద్రతల విభాగంలో పనిచేశారు. సేవా పతకాన్ని, యూఎన్‌ పతకాన్ని అందుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా సిద్దికీ వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమ మండల అదనపు డీసీపీగా పనిచేస్తున్నారు. ఈ పతకానికి ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉందని సిద్దికీ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

సమర్థ విధుల ‘ప్రతాపం’
కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన ఇండియన్‌ పోలీసు పతకానికి డీఎస్‌పీ (సీఐడీ) డి.ప్రతాప్‌ ఎంపికయ్యారు. 1991 బ్యాచ్‌కు చెందిన ప్రతాప్‌ నల్గొండ, సైబరాబాద్‌, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లలో వివిధ హోదాలలో పనిచేశారు. 1999లో బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌పై 30 మంది నక్సల్స్‌ దాడిని సమర్థంగా తిప్పికొట్టడం, 2010లో పాతబస్తీలో అల్లర్లను నియంత్రించడం తదితర అంశాల్లో సమర్థంగా పనిచేశారు. 2007లో కొసావాలో, 2018లో దక్షిణ సూడాన్‌లో ఐక్యరాజ్యసమితి పీస్‌ మిషన్‌లో పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది సార్లు ముఖ్యమంత్రి బంగారు పతకంతో సత్కరించింది. ప్రస్తుతం ఇండియన్‌ పోలీసు పతకం రావడం తనకెంతో ఆనందంగా ఉందని ప్రతాప్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.