close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నగదు కోసమే మరదలి హత్య

మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: నగదు పంపిణీ వివాదంలో మరదలు హబీబున్నీసాపై కక్ష పెంచుకుని సొంత బావే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 8న మణుగూరు పట్టణం అంబేడ్కర్‌ కూడలిలో హబీబున్నీసా(40) అనే మహిళను హత్యచేసి పరారైన ఇబ్రహీంను పోలీసులు గురువారం విలేకర్ల ఎదుట ప్రవేశపెట్టారు. సీఐ షుకూర్‌ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మణుగూరుకు చెందిన యాకుబ్‌అలీ, లాల్‌బీ దంపతులకు ఇమామ్‌, మహ్మద్‌, ఇబ్రహీం, మహబూబ్‌పాషాలతోపాటు, ముగ్గురు కుమార్తెలున్నారు. యాకుబ్‌అలీ చాలా ఏళ్ల క్రితమే మరణించటంతో లాల్‌బీ తన చిన్న కుమారుడైన మహబూబ్‌పాషా వద్ద ఉంటుంది. లాల్‌బీ తన వద్ద ఉన్న రూ.8 లక్షల నగదుకు నామినీగా మహబూబ్‌పాషా పేరు పెట్టి బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. లాల్‌బీ 2018లో మరణించగా ఆ నగదును నలుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోవాలని నిర్ణయించారు. కానీ ఇబ్రహీం అందుకు అంగీకరించలేదు. తనకు రూ.4 లక్షలు కావాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య వివాదాలు జరిగాయి. తల్లి మరణానంతరం ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ నగదు నామినీగా ఉన్న మహబూబ్‌పాషా బ్యాంకు ఖాతాలో జమ అవటం, సగం వాటా ఇచ్చే విషయంలో తమ్ముడి(మహబూబ్‌పాషా) భార్య హబీబున్నీసా అడ్డుగా ఉందని కక్ష పెంచుకుని ఇబ్రహీం ఆమెను మాంసం నరికే కత్తితో ఈ నెల 8న హతమార్చాడు.

ఛత్తీస్‌గఢ్‌ వెళ్లే ప్రయత్నంలో...: మరదలిని హత్య చేసిన రోజే ఇబ్రహీం.. తన భార్య, పిల్లల్ని తీసుకుని కర్ణాటకకు వెళ్లాడు. ఛత్తీస్‌గఢ్‌ వెళ్లేందుకు ఒక్కడే మళ్లీ తిరిగి వచ్చాడు. పినపాక మండలం చింతబయ్యారం క్రాస్‌రోడ్‌ వద్ద అతను సంచరిస్తున్నట్టు సమాచారం మేరకు పోలీసులు పట్టుకుని పోలీసు స్టేషన్‌కి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.