close

బుధవారం, సెప్టెంబర్ 30, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మత్తడి దూకుతూ.. రోడ్డు చిత్తవుతూ..

జిల్లాలో విస్తారంగా వర్షం

బెజ్జంకిలో 9.9 సెం.మీ. నమోదు

మత్తడి పడుతున్న హుస్నాబాద్‌ కొత్త చెరువు

న్యూస్‌టుడే - సిద్దిపేట టౌన్‌, హుస్నాబాద్‌ గ్రామీణం, చిన్నకోడూరు, ములుగు, చేర్యాల, సిద్దిపేట అర్బన్‌, హుస్నాబాద్‌, గజ్వేల్‌, కొండపాక: సిద్దిపేట జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లా సగటు 4.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం 8 నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా. బెజ్జంకి మండలంలో గరిష్ఠంగా 9.9 సెం.మీ. నమోదైంది. హుస్నాబాద్‌ - 8.3 సెం.మీ., కోహెడ - 8.2, సిద్దిపేట గ్రామీణ - 6.2, మద్దూరు - 6.1, నారాయణరావుపేట- 5.7, నంగునూరు - 5, కొమురవెల్లి - 4.6, దుబ్బాక - 4.5, సిద్దిపేట అర్బన్‌ - 4.3, తొగుట - 4, చిన్నకోడూరు - 3.9, కొండపాక - 3.6, అక్కన్నపేట - 3.2, మిరుదొడ్డి - 3.2, చేర్యాల - 3.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా కేంద్రం సిద్దిపేటలో సోమవారం రోజంతా వాన కురిసింది. రహదారులు జలమయ్యాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు నీటితో తొణికిసలాడుతున్నాయి.

క్షీరసాగర్‌ -అనంతారం గ్రామాల మధ్య దారిపై గుంత

కోతకు గురైన వంతెన

హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో నిర్మాణంలో ఉన్న వంతెన కోతకు గురైంది. గ్రామం నుంచి దేవేంద్రనగర్‌కు వెళ్లే రహదారి మార్గంలో కొత్తగా కల్వర్టును నిర్మిస్తున్నారు. సోమవారం కురిసిన వర్షంతో వరదనీటి ఉధృతికి కల్వర్టుకు ఇరువైపులా పోసిన మట్టి కొట్టుకుపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి చిన్నకోడూరు మండలం రంగాయిపల్లిలోని వ్యవసాయ పొలాల వద్ద ఆదివారం రాత్రి రెండు విద్యుత్తు స్తంభాలు ఒంగి, ఒకటి విరిగి పోయింది. తీగలు తెగిపడటంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం ఆ శాఖ ఏఈ కృష్ణప్రసాద్‌ సమస్య పరిష్కరించారు. ములుగు, మర్కూక్‌ మండలాలల్లో సోమవారం కురిసిన వర్షాలకు ప్రజలు అవస్థలు పడ్డారు. ములుగు నుంచి నర్సంపల్లికి వెళ్లే రహదారి బురదమయంగా మారింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో చేర్యాల చిత్తడిగా మారింది. కాలువల్లో వరదనీరు పరుగులు తీయకపోయినా, వీధులన్నీ బురదమయం అయ్యాయి. చేర్యాల పట్టణంలోని రెండో వార్డులో పుప్పాల మల్లయ్యకి చెందిన ఇల్లు వర్షానికి నేలకూలింది.

పొట్లపల్లిలో కోతకు గురైన వంతెన

పొంగి పొర్లుతూ..

హుస్నాబాద్‌, అక్కన్నపేట రెండు మండలాల్లోని ఒర్రెలు, వాగులు పొంగాయి. అంతకపేట, జనగామ, తోటపల్లి, గాంధీనగర్‌లోని కోనేటివాగు, పందిల్ల, పొట్లపల్లిలోని రేణుకాఎల్లమ్మవాగు, కూచనపల్లిలోని వాగుల ద్వారా వరదనీరు వాగుల ద్వారా చెరువులు, కుంటల్లోకి చేరుతోంది. చౌటపల్లి కొత్త చెరువు నిండింది. అంతకపేట, జనగామ, పొట్లపల్లిలోని చెక్‌డ్యాంలు నిండి పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల వరి పొలాలతో పాటు పత్తి చేలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట గ్రామీణ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు మోస్తరు వర్షం కురిసింది. సిద్దిపేట అర్బన్‌ మండలంలోని పొన్నాల ఊర చెరువు నిండి అలుగు పారింది. హుస్నాబాద్‌ డివిజన్‌లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. తీవ్ర ఉష్ణోగ్రతలతో వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హుస్నాబాద్‌ పట్టణానికి సమీపంలోని కొత్త చెరువు మత్తడి దూకుతోంది. ఇటీవల స్వలంగా మత్తడి వరకు నీరు చేరినా, ఈ వర్షంతో ఓ మోస్తరుగా ఉప్పొంగింది.

ప్రజ్ఞాపూర్‌ ఉపకేంద్రం ఎదుట నిలిచిన వర్షపు నీరు

రెండ్రోజుల వాన.. రెణ్నెల్ల రోడ్డుకు గుంత..

ములుగు మండలం వంటిమామిడిలో రాజీవ్‌ రహదారి నుంచి క్షీరసాగర్‌ మీదుగా మేడ్చల్‌ జిల్లా మూడు చింతలపల్లి మండలం అనంతారం వరకు రెండు వరసల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూరు చేసింది. పనులు మే నెలలో పూర్తి చేశారు. రెండు రోజుల వర్షానికి మాచిరెడ్డి కుంట వద్ద రహదారి మధ్యలో గుంత పడిగా మరమ్మతులు చేస్తామని ఏఈ శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం రోజంతా కురిసిన వర్షానికి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ పురపాలికలో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మండల వ్యాప్తంగా పత్తి, కంది చేెన్లలో నీళ్లు చేరాయి. అడ్డా కూలీలకు పనులు దొరకలేదు. కొండపాక మండలంలో వరి నాట్లు, దుక్కులకు ఆటంకం కలిగింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.