close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

వివాహిత ఆత్మహత్య

తొర్రూరు టౌన్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో ఓ మహిళ సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తొర్రూరు పెద్ద చెరువు సమీపంలో నివాసముండే పొన్నోజు జ్యోతి (36) తన భర్త సత్యనారాయణతో కలిసి హైదరాబాద్‌లో ఉంటుంది. సమీప బంధువులు చనిపోయారని తొర్రూరుకు వచ్చింది. ఈక్రమంలో ఆమె ఇంట్లోకి వెళ్లి ఎంతకు బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి, తలుపులు పగులకొట్టి చూడగా ఇంట్లో చీరతో ఉరి వేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు వివరాలు తెలియాల్సి ఉంది. ‘న్యూస్‌టుడే’ స్థానిక అదనపు ఎస్సై మునిరుల్లాను వివరణ కోరగా సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

పురుగుల మందు తాగి మరొకరు..

కేసిరెడ్డిపల్లి(బచ్చన్నపేట), న్యూస్‌టుడే: మండలంలోని కేసిరెడ్డిపల్లిలో సోమవారం ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఎస్సై రంజిత్‌రావు తెలిపిన ప్రకారం.. జనగామ మండలం వడ్లకొండకు చెందిన గోనె శ్రీను(30)కి బచ్చన్నపేట మండల కేసిరెడ్డిపల్లికి చెందిన చామనబోయిన లక్ష్మయ్య కూతురు యమునతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. జనగామలో ఆటో మెకానిక్‌ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 15న అత్తామామలు శ్రీనుతో గొడవ పడగా ఈనెల 20న తన భార్య పిల్లలతో కేసిరెడ్డిపల్లికి వెళ్లారు. అదే రోజు రాత్రి 7 గంటలకు పురుగుల మందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతణ్ని జనగామ ఏరియా ఆసుపత్రికి అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.