శుక్రవారం, డిసెంబర్ 06, 2019
సూరిపల్లి(నెక్కొండ), న్యూస్టుడే: సూరిపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎస్.దీపిక రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సుజన్ తేజ తెలిపారు. ఈ నెల 12న జేఎన్ఎస్ మైదానంలో స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో దీపిక పాల్గొని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ నెల 14 నుంచి రంగారెడ్డి జిల్లాలో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దీపికను ఉపాధ్యాయ బృందం అభినందించారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు