పులికాట్‌లో సందడి చేస్తున్న దేవతా పక్షులు

తాజా వార్తలు

Published : 28/11/2020 23:20 IST

పులికాట్‌లో సందడి చేస్తున్న దేవతా పక్షులు

నెల్లూరు: ఏటా వచ్చే విదేశీ అతిథులు నెల్లూరు జిల్లాకు మళ్లీ పర్యాటక శోభను తీసుకొచ్చాయి. పులికాట్‌ సరస్సులో కొత్త కాపురానికి వచ్చిన దేవతా పక్షులు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. ఏడు దేశాలకు చెందిన ఈ విహంగాలు వేల కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్‌ సరస్సుకు వస్తుంటాయి. పెలికాన్స్‌, గూడ బాతులు, కొంగలు వంటి 26 రకాల పక్షులు పులికాట్‌లో సందడి చేస్తాయి. ఐదు నెలలపాటు ఇక్కడే ఉండి సంతానోత్పత్తి చేస్తాయి. తర్వాత పిల్లలతో సహా స్వదేశాలకు ప్రయాణమవుతాయి. ఈ ఐదు నెలల పాటు రైతులు, మత్స్యకారులు, అధికారులు వాటిని సంరక్షిస్తుంటారు. దేవతా పక్షులుగా పిలుస్తూ ఎవరూ వాటికి హాని కలగనీయకుండా చూస్తారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి సమీపంలోనే పులికాట్‌ ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణించేవారు పక్షుల సందడిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని