ఫ్యాషన్‌ డిజైనర్‌ శర్బారీదత్తా కన్నుమూత

తాజా వార్తలు

Updated : 18/09/2020 13:19 IST

ఫ్యాషన్‌ డిజైనర్‌ శర్బారీదత్తా కన్నుమూత

కోల్‌కతా: ప్రముఖ బెంగాలీ ఫ్యాషన్‌ డిజైనర్‌ శర్బారీదత్తా (63) గుండెపోటుతో మృతిచెందారు. గురువారం రాత్రి బాత్‌రూమ్‌లో ఆమె కుప్పకూలిపోయారు. శర్బారీ పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని బ్రాడ్‌ స్ట్రీట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఈరోజు ఉదయం కుమారుడు అమాలిన్‌ దత్తా ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆయన తల్లి ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె బాత్‌రూమ్‌లో విగతజీవిగా కనిపించారు. అమాలిన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అయితే ఆమె గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తేల్చారు.

బెంగాలీ రచయిత అజిత్‌ దత్తా కుమార్తె శర్బారీదత్తా. బెంగాలీ సంస్కృతికి అద్దంపట్టేలా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తూ పేరు గడించారు. బెంగాలీ చిత్రసీమలోని ఎంతోమంది నటులకు ఆమె ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేశారు. ఈ దుర్ఘటనతో చిత్రసీమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజ్‌ చక్రవర్తి, అరిందమ్‌ సిల్‌ సహా పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని