బిహార్‌లో మరో మాంఝీ

తాజా వార్తలు

Updated : 15/02/2021 04:50 IST

బిహార్‌లో మరో మాంఝీ

చౌడు నేలలో 10 వేల చెట్ల పెంపకం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆయన సంకల్పం పనికిరాని చౌడు నేలలకు జీవం పోసింది.. మొక్క కూడా మొలవని చోటును పండ్ల తోటగా మార్చింది. మౌంటెయిన్‌ మ్యాన్‌ దశరథ్‌ మాంఝీ చెప్పిన ఒక్కమాట మంత్రమై అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మాంఝీ మాటలే శిరోధార్యంగా తీసుకొని బిహార్‌లోని గయకు చెందిన సత్యేంద్ర గౌతమ్‌ మాంఝీ సమాజ హితమే ధ్యేయంగా 15 ఏళ్లుగా సుదీర్ఘ సాగు ప్రయాణం చేస్తున్నారు. మొక్క కూడా మొలవని చోట 10 వేల చెట్లతో పండ్ల తోటను సృష్టించారు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉన్నా పర్యావరణహితమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. 

గయా జిల్లా ఇమాలియా చక్‌ గ్రామానికి చెందిన గౌతమ్‌ మాంఝీ ఫాల్గు నదిలోని ఓ ద్వీపంలో ఉన్న చౌడు నేలలో మొక్కలు నాటడం ప్రారంభించేకంటే ముందు ఆ ప్రాంతమంతా నిర్జీవంగా ఉండేది. ఎక్కడ చూసినా ఇసుక మాత్రమే కనిపించేది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మొక్కలు నాటి ప్రతి మొక్కను కన్న బిడ్డలా రక్షించుకున్నారు. ఇంటి నుంచి కుండలో నీరు మోసుకొచ్చి మొక్కలకు పోసేవారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కల పెంపకాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ముందుకుసాగి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.

15 ఏళ్ల క్రితం దశరథ్‌ మంఝీ తన ఇంటికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో మొక్కలు నాటాలని సూచించారని గౌతమ్‌ మాంఝీ పేర్కొన్నారు. ఆయన జ్వలింపజేసిన స్ఫూర్తి నేటికీ కొనసాగుతోందని గౌతమ్‌ అన్నారు. గౌతమ్‌ మాంఝీ మగధ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్‌ఏ పట్టా పొందారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌.. మాంఝీని పిల్లల సంరక్షణ కమిషన్‌ సభ్యుడిగా నియమించారు. మగధ విశ్వవిద్యాలయంలోనూ సెనేట్‌ సభ్యుడిగానూ గౌతమ్‌ మాంఝీ కొనసాగుతున్నారు.

ఇవీ చదవండి...

ఆ తల్లి ఫోన్‌ కాల్‌.. 25 మందిని కాపాడింది

‘దూరం ప్రేమను మరింత పెంచుతుంది’
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని