TS News: హైకోర్టుకు ఈటల భార్య..

తాజా వార్తలు

Updated : 27/05/2021 17:23 IST

TS News: హైకోర్టుకు ఈటల భార్య..

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా మాసాయిపేట భూముల సర్వేపై మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 5న అధికారులు ఇచ్చిన నోటీసులను ఉన్నత న్యాయస్థానంలో ఆమె సవాల్‌ చేశారు. జమున తరపున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. అసైన్‌మెంట్‌ భూములు తేల్చేందుకే నోటీసులు ఇచ్చినట్లు అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు.

దీనిపై స్పందించిన న్యాయస్థానం భూములు ఎవరివో తేలిస్తే తప్పేంటని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సరైన కారణం లేకుండా సర్వే నోటీసులు ఇచ్చారని దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ఈ పిటిషన్‌పై వాదనలు ముగించిన హైకోర్టు.. ఉత్వర్వులు జారీ చేస్తామని తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని