పురపోరులో తెరాస ఏకగ్రీవాల జోరు

తాజా వార్తలు

Published : 15/01/2020 00:49 IST

పురపోరులో తెరాస ఏకగ్రీవాల జోరు

హైదరాబాద్‌: పురపాలిక ఎన్నికల్లో ఏకగ్రీవాలతో తెరాస జోరు కొనసాగిస్తోంది. పలు పురపాలికల్లో వార్డులకు ఒకే అభ్యర్థి బరిలో ఉండగా గెలుపు లాంచనమైంది. పలు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవాలు సాధించిన తెరాస శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 35 మున్సిపాలిటీల్లోని 84 వార్డులు, ఓ డివిజన్‌ను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 700 వార్డుల్లో భాజపాకు, 400 వార్డుల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ రెండు పార్టీలకు సరైన కేడర్ లేదని.. ముసుగు పొత్తులో పరస్పరం సహకరించుకునే పనిలో ఉన్నాయంటూ రామచంద్రరావు ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఫలితాలే పునరావృతం అవుతాయని.. ఈనెల 22న జరిగే ఎన్నికల్లో తెరాస ఏకపక్ష విజయం సాధిస్తుందన్నారు.

చెన్నూరు మున్సిపాలిటీల్లో 18 వార్డులకు గాను 7 వార్డుల్లో తెరాస వశమయ్యాయి. నిర్మల్‌ పురపాలికలో ఇద్దరు తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం కాగా అభ్యర్థి ఈశ్వర్‌ను మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థిగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రకటించారు. కోరుట్ల పురపాలికలోని 3 వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనూ తెరాస అభ్యర్థులు ఏకగ్రీవాలు సాధించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పురపాలికలోని 23 వార్డులకుగాను 6 వార్డులు, చెన్నూరులో 18 వార్డులకు గాను 7 వార్డుల్లో తెరాస ఏకగ్రీవం సాధించింది. మేడ్చల్‌ జిల్లా పోచారం పురపాలికలో ఇద్దరు, సిరిసిల్లలో 4, వరంగల్‌ గ్రామీణం జిల్లా పరకాల పురపాలికలో 11 వార్డుల్లో తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని