ఎదురుగా ఏనుగు వస్తోందని తెలియక..!

తాజా వార్తలు

Published : 03/04/2020 15:25 IST

ఎదురుగా ఏనుగు వస్తోందని తెలియక..!

పాల వ్యాపారికి వింత అనుభవం

డెహ్రాడూన్‌: రోడ్డుపై ఎదురుగా ఏనుగు.. దాన్ని చూసిన వారెవరైనా ధైర్యంగా అడుగు ముందుకేస్తారా? కష్టమే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ శివార్లలో ఓ పాల వ్యాపారికి కూడా అనుకోకుండా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ద్విచక్ర వాహనంపై వస్తోన్న అతడు ఎదురుగా వస్తున్న ఏనుగును గమనించకుండా దగ్గరికి వచ్చేశాడు. ఆపై ఏనుగును చూసి షాకయ్యాడు. వాహనాన్ని అక్కడే వదిలేసి.. పరుగులు తీశాడు. ఈ ఘటనను రోడ్డు పక్కనున్న ఇంటిపై నుంచి కొందరు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా దీన్ని రీట్వీట్‌ చేశారు. జాగ్రత్తగా ఉండమని కోరారు.

ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి వైభవ్‌ సింగ్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈసారి డెహ్రాడూన్‌ శివార్లకు రావాలనుకున్నా, ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లాలనుకున్నా.. వీడియోలో వ్యక్తిలా జాగ్రత్తగా ఉండండి’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 34.1 వేల మందికిపైగా వీక్షించారు. ఏనుగులు సాధు జంతువులేనని, కానీ మనుషులు.. ప్రకృతిలోని మార్పులు వాటిలోని క్రూరత్వాన్ని బయటికి తీసుకొస్తుంటాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఏనుగులు మనుషుల ప్రాణాలు తీసిన భయానక ఘటనల్ని చాలానే చూశాం. కానీ ఇక్కడ మాత్రం అది తన దారిన అది పోయింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని