జగన్‌ పిటిషన్‌పై విచారణ జులై 2కి వాయిదా
close

తాజా వార్తలు

Published : 22/06/2021 17:58 IST

జగన్‌ పిటిషన్‌పై విచారణ జులై 2కి వాయిదా

హైదరాబాద్‌: అరబిందో, హెటిరో భూకేటాయింపులపై ఈడీ కేసు విచారణలో తనకు బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతించాలన్న సీఎం జగన్‌ పిటిషన్‌పై విచారణ జులై 2కి వాయిదా పడింది. జగన్‌ తరఫు వాదనల కోసం సీబీఐ, ఈడీ కోర్టు వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులపై ఈడీ కేసుల విచారణ ఇవాళ జరిగింది. 

ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. పిటిషన్లను త్వరగా విచారణ కేసుల జాబితాలో పెట్టాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోరుతూ ఈనెల 17న న్యాయవాది లేఖ కూడా రాశారని వివరించారు. హైకోర్టు న్యాయమూర్తి సెలవులో ఉన్నందున .. పిటిషన్లు విచారణకు రాలేదన్నారు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున ... ఈడీ కేసుల్లో అభియోగాల నమోదు ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. విజయసాయిరెడ్డి అభ్యర్థనను అంగీకరించిన సీబీఐ, ఈడీ కోర్టు విచారణను జులై 2కి వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని