చదువుపై మక్కువతో గుర్రంపై సవారీ

తాజా వార్తలు

Published : 11/02/2021 01:31 IST

చదువుపై మక్కువతో గుర్రంపై సవారీ

భోపాల్‌: మనసుంటే మార్గం ఉంటుందని రుజువు చేశాడు... మధ్యప్రదేశ్‌లోని ఖండ్‌వాకు చెందిన 12 ఏళ్ల బాలుడు శివరాజ్‌! వారి ప్రాంతానికి బస్సులు రావు. బడికి వెళ్లాలంటే వాహనం తప్పనిసరి. దీంతో ‘‘పాఠశాలకు వెళ్లాల్సిన అవసరమేం లేదు... ఇంటి దగ్గరే ఉండు’’ అని అతని తండ్రి చెప్పాడు. కానీ శివరాజ్‌ అందుకు ఒప్పుకోలేదు. చదువుపై మక్కువతో ఎలాగైనా బడికి వెళ్లాలనుకున్నాడు. కొడుకు సైకిల్‌పై వెళ్తే కింద పడిపోతాడనే భయంతో శివరాజ్‌ తండ్రి ప్రత్యేక వాహనం సమకూర్చుదామనుకున్నాడు. కానీ, పెట్రోలు, డీజిల్‌ ఖర్చులు భరించేంత స్థోమత ఆయనకు లేదు. దీంతో ఆ బుడతడు మంచి ఆలోచన చేశాడు. తనకు ఓ చిన్న గుర్రాన్ని కొనివ్వమని తండ్రిని అడిగాడు. అందుకు ఆయన అంగీకరించి, అశ్వాన్ని కొనిచ్చాడు. గుర్రంపై సవారీ చేస్తూ రాజసంగా బడికి వెళ్తున్నాడు శివరాజ్‌!

ఇవీ చదవండి..
స్నేహితుడిని కలవడానికి వెళ్తే.. రూ. కోటి లాటరీ!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని