Krishna Water Issue: ఏపీ పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ

తాజా వార్తలు

Published : 04/08/2021 12:05 IST

Krishna Water Issue: ఏపీ పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ

దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన పరిష్కారం కోరుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు తెలిపారు. సీజేఐ ధర్మాసనమే విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. కేంద్రం విజ్ఞప్తిని నిరాకరించిన సీజేఐ ధర్మాసనం.. ఏపీ పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ పిటిషన్‌పై తాను విచారణ చేపట్టనని ఈ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని