Nara Lokesh: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న నారా లోకేశ్‌

తాజా వార్తలు

Updated : 31/08/2021 16:16 IST

Nara Lokesh: భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న నారా లోకేశ్‌

భద్రాద్రి: భద్రాద్రి రామయ్యను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని రామయ్యను కోరుకున్నట్లు చెప్పారు. పోలవరం ముంపు మండలాల్లోని నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న నేపథ్యంలో.. వారికి  పరిహారం అందేలా పోరాటం చేస్తానని ఆయన వివరించారు. పోలవరం ముంపు మండలాలైన వీఆర్ పురం, చింతూరులో పర్యటిస్తున్న లోకేశ్.. నిర్వాసితులతో పరామర్శించారు. అనంతరం వారితో సమావేశమ్యారు. ఈ పర్యటనలో దేవినేని ఉమ, చినరాజప్ప, జ్యోతుల నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని