Anand Mahindra: కరోనా అంతమైన రోజు..నా ఫీలింగ్ అదే!
close

తాజా వార్తలు

Published : 11/06/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Anand Mahindra: కరోనా అంతమైన రోజు..నా ఫీలింగ్ అదే!

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసే పోస్టుల్లో ఆలోచన, హాస్యం మిళితమై ఉంటాయి. ప్రస్తుతం కరోనా గురించి ఆయన పెట్టే పోస్టులు అలాగే ఉంటున్నాయి.  మహమ్మారి అడుగుపెట్టిన దగ్గరి నుంచి ఒక దగ్గర కూర్చొని చెప్పుకునే ముచ్చట్లు లేవు. స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితి లేదు. బంధువుల ఇళ్లకు వెళ్లి గడిపే సందర్భాలు లేవు. అందుకే ఆనాటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని ప్రతిఒక్కరు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో మహీంద్రా కూడా ఉన్నారంటే అతిశయోక్తి ఏమీ లేదు. 

తాజాగా మహీంద్రా తన మనసులో మాటను ఫన్నీ పోస్టుతో బయటపెట్టారు. ‘వాళ్లు సాకర్ మ్యాచ్ చూస్తుండొచ్చు. అయితే ఈ మహమ్మారి ఇక అంతమైందని టీవీలో ప్రకటించగానే..నేను ఆ పూచ్‌(పెంపుడు శునకం) మాదిరిగానే ఎగిరి గంతేస్తాను’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. దాంట్లో పెంపుడు శునకంతో కలిసి ఓ మహిళ ఆసక్తిగా టీవీ చూస్తోంది. ఆ సమయంలో శునకం హఠాత్తుగా ఎగిరి దూకడం, పక్కనే ఉన్న ఓ మహిళ గట్టిగా నవ్వడం కనిపిస్తుంది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ‘నిజంగా నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఆ సందర్భం వచ్చినప్పుడు, మనమంతా ఎగిరిగంతేస్తాం’ అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని