TSRTC, METRO ప్రయాణ వేళలు పొడిగింపు
close

తాజా వార్తలు

Updated : 09/06/2021 16:54 IST

TSRTC, METRO ప్రయాణ వేళలు పొడిగింపు

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన ప్రాంతాలన్నింటిలో పగటి పూట లాక్‌డౌన్‌ను సర్కారు ఎత్తివేసిన నేపథ్యంలో బస్సు సర్వీసుల వేళలను టీఎస్‌ఆర్టీసీ పొడిగించింది. సడలింపులకు అనుగుణంగా 10వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలకు నడిపే బస్సులను తిప్పనున్నట్లు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు నడుపుతున్నామని.. వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని స్పష్టం చేశారు.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీఎస్ఆర్టీసీ సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ ఈడీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. లాక్ డౌన్ విరామ సమయంలో సిటీ బస్సులను తిప్పుతామని ఈడీ తెలిపారు. గ్రేటర్ పరిధిలోని బస్ పాస్ కౌంటర్లన్నీ ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పనిచేస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మెట్రో వేళల్లోనూ మార్పులు..

పగటిపూట లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో హైదరాబాద్ మెట్రో రైలు సేవల సమయం పొడిగించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ కార్యాలయం ప్రకటించింది. అన్ని చివరి స్టేషన్‌ల నుంచి సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో రైలు బయలుదేరుతుందని వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని