close

ప్రధానాంశాలు

దిల్లీని గెలిపించిన శ్రేయస్‌

దిల్లీ: ఐపీఎల్‌ 12వ సీజన్‌లో ప్లేఆఫ్ చేరేందుకు పటిష్ఠ పునాది వేసుకుంది దిల్లీ క్యాపిటల్స్‌. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఓటమికి పగ తీర్చుకుంది. అశ్విన్‌ సేన నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలుండగానే ఛేదించింది. సారథి శ్రేయస్‌ అయ్యర్‌ (58; 49 బంతుల్లో 5×4, 1×6) అజేయ అర్ధశతకంతో కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (56; 41 బంతుల్లో 7×4, 1×6) మెరుపులు మెరిపించాడు. పృథ్వీషా (13) త్వరగా ఔటైనా భారీ బౌండరీలు బాది జట్టుకు శుభారంభం అందించాడు. శ్రేయస్‌తో కలిసి రెండో వికెట్‌కు 92 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రిషభ్ పంత్‌ (6) నిరాశపరిచాడు. పంజాబ్‌లో క్రిస్‌గేల్‌ (69; 37 బంతుల్లో 6×4, 5×6) బీభత్సం సృష్టించాడు. మన్‌దీప్‌ సింగ్‌ (30; 27 బంతుల్లో 1×4, 1×6), హర్పీత్‌ బ్రార్‌ (20 నాటౌట్‌; 12 బంతుల్లో 2×4, 1×6) ఆకట్టుకున్నారు.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net