close

ప్రధానాంశాలు

పంత్‌కు ఓనమాలు నేర్పిన జీవా ధోనీ

ముంబయి: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఘన విజయం సాధించింది. ఐపీఎల్‌ 12వ సీజన్‌ ఫైనల్‌ చేరుకుంది. హైదరాబాద్‌లో ముంబయి ఇండియన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌పంత్‌ను ఎంఎస్‌ ధోనీ వారసుడిగా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ముగియగానే ధోనీ సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ వీడియోలో ధోనీ, సాక్షి ముద్దుల కూతురు జీవా ఏకంగా రిషభ్‌పంత్‌కే హిందీలో ఓనమాలు నేర్పించింది. ఆ బుల్లి టీచర్‌ చెప్పే పాఠాన్ని పంత్‌ శ్రద్ధగా నేర్చుకోవడం గమనార్హం. ఇప్పుడీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

View this post on Instagram

Back to Basics !

A post shared by ZIVA SINGH DHONI (@ziva_singh_dhoni) on



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net