close
Array ( ) 1

తాజా వార్తలు

వయసు 12.. బాధ్యత 3,500 పుస్తకాలు

కొచ్చి: ‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అన్న కందుకూరి వీరేశలింగం మాటలు అందరికీ తెలిసే ఉంటాయి. కానీ దాన్ని ఆచరణలో పెట్టే వారు కొందరే. అయితే కేరళకు చెందిన యశోద డి షినోయి అనే బాలిక మాత్రం ఆ మాటను ఆచరణలో పెట్టడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆదర్శంగా అంటే అలా ఇలా కాదు.. ఏకంగా ఒక గ్రంథాలయాన్నే నెలకొల్పి, దేశంలోనే తొలి ‘బాల లైబ్రేరియన్‌’గా పేరొందింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొచ్చికి చెందిన యశోద (12)కు చిన్నప్పటి నుంచి పుస్తకాలన్నా, చదవడం అన్నా అమితమైన ఆసక్తి ఉండేది. అలా తాను చదువుకోవడానికి గ్రంథాలయం నుంచి పుస్తకాలు తీసుకుని తిరిగి ఇచ్చేటప్పుడు ఒక రోజు ఆలస్యమైనా జరిమానా విధించేవారు. ఇలాంటి పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి వాళ్లు ఎలా చదువుకుంటారు అనే ఆలోచన తన మదిలో కలిగింది. ఆ ఆలోచనే  లైబ్రరీని నెలకొల్పేలా చేసింది.
తన గ్రంథాలయంలో దాదాపు 3500 పుస్తకాలు ఉన్నాయని వాటిలో 2500 మళయాళం పుస్తకాలు కాగా, 1000 ఆంగ్ల పుస్తకాలు ఉన్నాయని తెలిపింది. ఈ గ్రంథాలయ ప్రత్యేకతలు ఏమిటంటే ఇక్కడ చదువుకోవడానికి వచ్చే వారికి ఎలాంటి సభ్యత్వం, ఫీజూ ఉండదు. వచ్చి ఉచితంగా చదువుకుని వెళ్లొచ్చు. తన ఆసక్తికి అనుగుణంగా ఇంట్లో వాళ్లు ప్రోత్సహించడంతోనే తాను గ్రంథాలయాన్ని పెట్టగలిగాని చెప్పుకొచ్చింది యశోద. తన గ్రంథాలయానికి సంబంధించి ఆమె తండ్రి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌లు చేయడంతో చాలామంది దాతలు ముందుకు వచ్చి పుస్తకాలు బహుకరించారని తెలిపింది. అందువల్లే తాను తన గ్రంథాలయంలో మంచి మంచి పుస్తకాలు సేకరించగలిగానని వివరించింది. బాగా చదువుకుని భవిష్యత్తులో న్యాయవాది కావడమే తన లక్ష్యమని చెబుతోంది యశోద.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.