close

తాజా వార్తలు

Published : 23/11/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెరాసపై మజ్లిస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: అధికార తెరాసపై ఎంఐఎంకు చెందిన చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తలచుకుంటే రెండు నెలల్లో తెరాస ప్రభుత్వాన్ని దించేయగలమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు సీటులో కూర్చొబెట్టడమూ.. దించడమూ తెలుసన్నారు. మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఇప్పుడే కళ్లు తెరిచిన చిలుక అని వ్యాఖ్యానించారు. రాజకీయం ఎంఐఎంకు కొత్తకాదని.. ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలను చూసిందన్నారు. ప్రత్యర్థి పార్టీలు మజ్లిస్‌ను విమర్శించడం కొత్తకాదని.. అలాచేసిన ఎన్నో పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయని చెప్పారు. ఎవరెన్ని శాపనార్ధాలు పెట్టినా ఎంఐఎం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

ఇవీ చదవండి..
‘తెరాస యాక్షన్‌ బట్టే భాజపా రియాక్షన్‌’

తెరాసను ప్రజలు ప్రశ్నించాలి: కిషన్‌రెడ్డి


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని