close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 28/06/2020 18:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెజాన్‌లో 20వేల ఉద్యోగాలు

దిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం ఆమెజాన్‌ భారత్‌లో సుమారు 20వేల తాత్కలిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్టు ఆదివారం పేర్కొంది. వీరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అవసరమైన సేవలు అందించనుంది. ఈ తాత్కాలిక ఉద్యోగులతో రానున్న ఆరునెలలపాటు వినియోగదారుల అవసరాలు తీర్చడంలో ఇబ్బంది ఉండదని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌(వినియోగ దారుల సేవా విభాగం) అక్షయ్‌ప్రభు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు మరో పది నగరాల్లో ఉన్న తమ సంస్థ అనుబంధ కార్యాలయాల్లో ఈ ఉద్యోగాలను కల్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆంగ్లంతోపాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 2025 కల్లా ఇండియాలో సుమారు పదిలక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ఈ ఏడాది ఆరంభంలో అమెజాన్‌ ఇండియా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపధ్యంలో ఆన్‌లైన్‌ అమ్మకాల జోరు పెరిగింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.