close

తాజా వార్తలు

Updated : 23/11/2020 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవన్నీ పాత మేనిఫెస్టోలో అంశాలే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: 2016 ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తెరాస ఇప్పటికీ అమలు చేయలేదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత మేనిఫెస్టోలోని అంశాలనే ఈసారి ఎన్నికల్లోనూ పొందుపరిచారని అన్నారు. తెరాస మెనిఫెస్టోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేసిన అనంతరం హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను విశ్వనరగం కాదు.. విషాద నగరం చేశారని మండిపడ్డారు. ఇటీవల హైదరాబాద్‌ వరదల్లో 40 మందికిపైగా చనిపోయారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘ సెలూన్లు, దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ అని గతంలోనే చెప్పారు. తాగునీటి గోస తీరుస్తామని ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు.గత ఆరున్నరేళ్లుగా వరద నీటి నిర్వహణ పనులు సరిగా చేపట్టలేదు’’ అని కిషన్‌రెడ్డి అన్నారు. పాత నగర ప్రజల ఓట్లు అడిగే హక్కు తెరాస, మజ్లిస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్‌ విస్తరణ, తక్కువ ధరలకే ప్రయాణం అని చెబుతున్నారని, ఎంఎంటీఎస్‌ పనులను రైల్వే చేపడుతుందని, కొంత వాటా రాష్ట్రం ఇస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు 98శాతం పూర్తయ్యాయని, రాష్ట్రం వాటా ఇవ్వనందునే ఎంఎంటీఎస్‌ పనుల్లో జాప్యం తలెత్తిందని అన్నారు. తెరాస నేతలు ట్రాఫిక్‌ ఫ్రీ నగరం అని గొప్పలు చెబుతున్నారని, అలాంటి పరిస్థితులు నగరంలో ఉన్నాయో లేదో ప్రజలకే తెలియాలని అన్నారు.ఆరున్నరేళ్లలో ఒక్క కొత్త రేషన్‌ కార్డు కూడా మంజూరు చేయలేదని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని