close

తాజా వార్తలు

Published : 27/05/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

ఏలూరు ప్రభుత్వాసుపత్రి: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని కొవిడ్‌ ఆస్పత్రిలో కరోనాబారిన పడి చికిత్స పొందుతున్న ఓ గర్భిణి ఇవాళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన బిడ్డకు వైద్యులు కరోనా పరీక్షలు చేయగా నెగెటివ్‌గా నిర్ధారణ అయిందని కొవిడ్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం తోటగూడేనికి చెందిన దంపతులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నెలలు నిండటంతో గర్భవతి అయిన బాధితురాలిని కుటుంబసభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం కొద్దిరోజుల క్రితం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో బాధితురాలిని ఏలూరులోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. గత 10 రోజులుగా బాధితురాలు అక్కడే చికిత్స పొందుతుంది. అనంతరం బాధితురాలి భర్తకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రావటంతో.. భార్యాభర్తలిద్దరూ అక్కడే చికిత్స పొందుతున్నారు.

బాధితురాలికి నెలలు పూర్తికావడంతో వైద్యులు మంగళవారం ఎలక్ట్రిక్‌ సర్జరీ ద్వారా శస్త్ర చికిత్స చేసి మగ బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. ఈ సందర్భంగా కొవిడ్‌ ఆస్పత్రి ఇన్‌ఛార్జ్‌ వైద్యుడు ఏవీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘తల్లీబిడ్డా ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. బిడ్డకు పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం బిడ్డను తల్లి నుంచి వేరుగా ఉంచాం. తల్లిపాలను సేకరించి బిడ్డకు అందిస్తాం. తల్లికి నెగెటివ్‌ వచ్చాక బిడ్డను ఆమె చెంతకు చేరుస్తాం’’ అని మోహన్‌ వివరించారు.
 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని