close

తాజా వార్తలు

Published : 29/07/2020 10:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌: 34వేలు దాటిన కరోనా మరణాలు!

24గంటల్లో 48,513 కేసులు, 768 మంది మృతి
భారత్‌లో 15లక్షలు దాటిన కరోనా కేసులు!
12రోజుల్లోనే 5లక్షల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం దాదాపు 48వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,513 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 15,31,669కు చేరింది. దేశంలో మరణాల సంఖ్య కలవరపెడుతోంది. నిత్యం దాదాపు 700 కొవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 768మంది కొవిడ్‌ రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో కరోనాతో మరణించిన వారిసంఖ్య 34,193కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బాధితుల్లో ఇప్పటికే 9,88,029 మంది కోలుకోగా మరో 5,09,447 క్రియాశీల కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.24శాతానికి చేరగా, మరణాల రేటు 2.25శాతంగా ఉంది.

12రోజుల్లోనే 5లక్షల కేసులు..
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాప్తిచెందుతోంది. దేశంలో తొలి ఐదు లక్షల కేసులు నమోదుకావడానికి దాదాపు 148రోజులు పట్టింది. అనంతరం మరో 20రోజుల్లోనే కేసుల సంఖ్య
 రెట్టింపై 10లక్షల మార్కును దాటింది. తాజాగా 10లక్షల కేసుల నుంచి 15లక్షల కేసులు నమోదుకావడానికి కేవలం 12రోజుల సమయం మాత్రమే పట్టింది.

ఇవీ చదవండి..
అంటించుకుంటూ..అంటిస్తూ..!
కరోనా పరీక్షలా..? ఇక్కడ చేస్తారు..!


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని