
తాజా వార్తలు
వేడుకగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్
సందడి చేసిన తారలు
ది ఫ్యామిలీ మ్యాన్ టీమ్
ముంబయి: లాక్డౌన్ కారణంగా థియేటర్లు పూర్తిగా మూతపడడంతో సినీ ప్రేమికులు ఓటీటీ బాటపట్టారు. దీంతో పలు చిత్రాలు ఓటీటీ వేదికగా విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. మరోవైపు యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్.. ఇలా వివిధ విభాగాల్లో పలు వెబ్‌సిరీస్‌లూ ప్రేక్షకులను మెప్పించాయి. ఈ నేపథ్యంలోనే ఓటీటీ వేదికగా విడుదలైన ఎన్నో వెబ్‌సిరీస్‌లు, అందులోని నటీనటుల కష్టాన్ని గుర్తిస్తూ.. వారి ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఫిలింఫేర్లో ఈ ఏడాది నుంచి ఓటీటీ అవార్డ్స్ ఇవ్వనుంది.
పాతాల్ లోక్ టీమ్
ఈ క్రమంలోనే ఈ ఏడాదికిగాను మొట్టమొదటిసారిగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డుల ప్రదానోత్సవం శనివారం సాయంత్రం వేడుకగా జరిగింది. ఇందులో ‘ఫ్యామిలీ మ్యాన్’, ‘పాతాల్ లోక్’ సిరీస్‌లు ఎక్కువగా అవార్డులను సొంతం చేసుకున్నాయి. మరోవైపు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు నటీనటులు పాల్గొని సందడి చేశారు.
విజేతల జాబితా ఇలా..
1. ఉత్తమ సిరీస్: పాతాల్ లోక్
2. ఉత్తమ దర్శకుడు: అవినాశ్ అరుణ్ అండ్ ప్రొసిత్ రాయ్ (పాతాల్ లోక్)
3. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఉత్తమ సిరీస్: ది ఫ్యామిలీ మ్యాన్
4. ఉత్తమ దర్శకుడు (విమర్శకుల): కృష్ణ డీకే అండ్ రాజ్ నిడిమోరు (ది ఫ్యామిలీ మ్యాన్)
5. డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు: జైదీప్ హలావత్ (పాతాల్ లోక్)
6. డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటి : సుస్మితాసేన్ (ఆర్య)
7. డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు (విమర్శకుల): మనోజ్ వాజ్‌పేయీ (ది ఫ్యామిలీ మ్యాన్)
8. డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటి (విమర్శకుల): ప్రియమణి (ది ఫ్యామిలీ మ్యాన్)
9. కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటుడు: జితేంద్రకుమార్ (పంచాయత్)
10. కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటి: మిథిలా పాల్కర్ (లిటిల్ థింగ్స్ సీజన్-3)
11. కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటుడు (విమర్శకుల): ధ్రువ్ సెహగల్ (లిటిల్ థింగ్స్ సీజన్-3)
12. కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటి(విమర్శకుల): సుముఖి సురేష్ (పుష్పావలి సీజన్-2)
13. డ్రామా సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: అమిత్ సద్ (బ్రీత్: ఇన్ టు ది షాడో)
14. డ్రామా సిరీస్‌లలో ఉత్తమ సహాయ నటి: దివ్యా దత్త (స్పెషల్ ఓపీఎస్)
15. కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటుడు: రఘువీర్ యాదవ్ (పంచాయత్)
16. కామెడీ సిరీస్‌లో ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (పంచాయత్)
17. బెస్ట్ నాన్ ఫిక్షన్ ఒరిజినల్ (సిరీస్/స్పెషల్స్): టైమ్స్ ఆఫ్ మ్యూజిక్
18. ఉత్తమ కామెడీ(సిరీస్/స్పెషల్స్): పంచాయత్
19. ఉత్తమ సినిమా (వెబ్ ఒరిజినల్): రాత్ అకేలి హై
ఇవీ చదవండి
‘మా ఫ్రిజ్‌లో అవేమీ ఉండవు’: చిరంజీవి