close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120042034 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 1sjliKZtNcs [video_short_link] => 1sjliKZtNcs [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-28 16:29:33.440978 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

లాక్‌డౌన్‌ పాటిస్తారా.. లాకప్‌లో ఉంటారా..

గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌

గుంటూరు: గుంటూరు ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడిని పట్టుకున్నట్లు గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌ తెలిపారు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని తేలిందని చెప్పారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్‌ అమలు తీరును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారి వాహనాలను మూకుమ్మడిగా ఆపడం సరికాదన్నారు. లాక్‌డౌన్‌ పాటించకుండా ఎందుకు బయటకు వచ్చారో వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత వారిని వెనక్కు పంపాలని సూచించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఇప్పటి వరకు 1378 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 11మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వివరించారు.

అదేవిధంగా కరోనా కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్‌ను పాటిస్తారో.. లేదా లాకప్‌లో ఉంటారో ఆకతాయిలు తేల్చుకోవాలని ఐజీ హెచ్చరించారు. లాక్‌డౌన్‌ కారణంగా నగరంలో తిండి లేక ఇబ్బంది పడుతున్న దినసరి కూలీలకు స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి భోజనం పెట్టిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎవరూ జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లొద్దని ఐజీ విజ్ఞప్తి చేశారు. నగరంలో రెండు పాజిటివ్‌ కేసులు వచ్చిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి ప్రజలను మరింత అప్రమత్తం చేసినట్లు ఐజీ తెలిపారు. అదేవిధంగా పాజిటివ్‌ వ్యక్తులను కలిసిన 30మందిని గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐసోలేషన్‌కు పంపించినట్లు ఐజీ ప్రభాకర్‌ చెప్పారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.