close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/04/2020 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Comments

మీరు బయటికొస్తే, నేను మీ ఇంటికొస్తా...!

బెంగళూరు: కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలను బయటికి రావద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి పోలీస్‌ కానిస్టేబుల్‌ వరకూ అందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మహమ్మారిని గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావటం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ విధమైన చర్యల్లో భాగంగా బెంగళూరు పోలీసులు చేసిన పని పలువురిని ఆకట్టుకుంటోంది. 

‘‘మీరు రోడ్డు మీదికి వస్తే...నేను మీ ఇంటికి వస్తా...’’ అని కొవిడ్‌-19 చెబుతున్నట్టు వారు నాగెనహళ్లిలోని ఓ చెక్ పోస్ట్‌ వద్దనున్న రహదారిపై స్థానిక భాషలో రాశారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ చిత్రాన్ని అక్కడ వేశారు. ఏ అవసరం లేకుండా రోడ్డు మీదకు వచ్చిన వారు దీన్ని చదివిన తర్వాత వెనుదిరుగుతున్నారట. కాగా, కర్ణాటకలో బుధవారం నాటికి మొత్తం 110 కేసులు నమోదైనట్టు తెలిసింది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.