
తాజా వార్తలు
ఫేస్బుక్ ఫ్రెండ్ అని నమ్మి వెళ్తే.. కాటేశాడు!
ముంబయి ఈవెంట్ మేనేజర్‌పై అత్యాచారం
దిల్లీలోని ఫైవ్‌స్టార్ హ ోటల్లో ఘటన
దిల్లీ: దేశ రాజధాని నగరంలో ఓ మహిళా ఈవెంట్ మేనేజర్‌పై దారుణం జరిగింది. ముంబయికి చెందిన 27 ఏళ్ల మహిళపై ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇద్దరు దాబా యజమానులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ శనివారం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు చెప్పారు. నిందితులను మిక్కీ మెహతా (57), నవీన్ డావర్ (46) దిల్లీలోని లజ్‌పత్‌నగర్, సాకేత్ ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. ఇద్దరూ హరియాణాలోని సోనిపట్‌లో రెస్టారెంట్ నడుపుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 18, 19 తేదీల్లో తన ఫేస్బుక్ ఫ్రెండ్ మిక్కీ మెహతా, అతడి సన్నిహితుడు డావర్లను కలిసినట్టు ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కన్నాట్ ప్లేస్ నుంచి 19న దిల్లీ విమానాశ్రయం సమీపంలోని ఎయిరోసిటీ వద్ద ఉన్న హోటల్‌కు తిరిగి వస్తున్న సమయంలో డావర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆమె ఆరోపించింది. అయితే, అతడు తనతో పాటు మెహతాను హోటల్ వద్ద దించి వెళ్లిపోయాడని, అనంతరం హోటల్ గదిలో మెహతా తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపిస్తూ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ దారుణం తర్వాత తనను ఆనంద్ విహార్ ప్రాంతంలో విడిచి పెట్టి అతడు పరారైనట్టు తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- స్వాగతం అదిరేలా..
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
