close

తాజా వార్తలు

Published : 16/07/2020 20:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్ 10 న్యూస్ @ 9 PM

1. భారత్‌-యూఎస్‌ మధ్య విమాన సేవలు మొదలు

కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ సర్వీసులు నిలిచిపోయిన వేళ.. అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలతో భారత్‌ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ రెండు దేశాలతో విమాన సేవలకు సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఒప్పందం కుదిరిన దేశాలు తమ విమాన సర్వీసులను నడపనున్నాయి. శుక్రవారం నుంచే ఈ విమాన సేవలు ప్రారంభం కానున్నాయని కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. వరవరరావుకు కరోనా పాజిటివ్‌

ముంబయిలోని తలోజా జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజాకవి వరవరరావుకు కరోనా సోకింది. ఈ మేరకు వైద్యులు వెల్లడించారు. బీమా కొరేగావ్‌ కేసులో అరెస్టయి 22 నెలలుగా  జైలులో ఉన్న వరవరరావును మే నెలలో జేజే ఆసుపత్రిలో చేర్చినప్పటికీ, చికిత్స పూర్తికాకముందే మళ్లీ జైలుకు పంపించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత  క్షీణించింది. దీంతో ఆయన ప్రాణానికి ముప్పు ఉందని, వెంటనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు డిమాండ్‌ చేయడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. సచిన్‌ పైలట్‌ పిటిషన్‌: విచారణ వాయిదా!

రాజస్థాన్‌ స్పీకర్‌ నోటీసులను సవాలు చేస్తూ రాజస్థాన్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ ఆరాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ సమయంలో సవరణతో కూడిన పిటిషన్‌ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని సచిన్‌పైలట్‌తోపాటు కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలు హైకోర్టును కోరారు. వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, రేపటిలోగా సవరణతోకూడిన తాజా పిటిషన్‌ దాఖలు చేయాలని వారికి సూచించింది. ఈ కేసును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారణ చేపట్టగా, తాజా పిటిషన్‌ దాఖలు చేసిన అనంతరం తిరిగి విచారణ చేపడతామని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. తప్పనిసరైతేనే బ్యాంకుకు రండి: ఓం ప్రకాశ్‌

కోవిడ్ కేసులు విస్త్రృతంగా పెరుగుతున్నందున ఎస్‌బీఐ ఉద్యోగులను, ఖాతాదారులను వైరస్‌ నుంచి రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాశ్‌ మిశ్రా వెల్లడించారు. వివిధ బ్రాంచిల్లో భౌతిక దూరాన్ని పాటించడం, అవసరమైన మేర శానిటైజర్లు ఉంచడం, మాస్క్‌లు అందించడం తదితర చర్యలను చేపట్టామన్నారు. ఖాతాదారులు తప్పనిసరైతేనే బ్యాంకులకు రావాలన్నారు. ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కుల్‌భూషణ్‌ వద్దకు భారత న్యాయవాది!

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను న్యాయవాది ద్వారా రెండోసారి కలిసేందుకు అనుమతి లభించినట్టు సమాచారం. గురువారం సాయంత్రం ఆయన్ను భారత ప్రతినిధులు కలుస్తారని తెలుస్తోంది. 2019, సెప్టెంబర్‌లో మొదటిసారి కలవడం గమనార్హం. తాజాగా రెండోసారి న్యాయవాది ద్వారా కలిసేందుకు దౌత్యవేత్తలకు అనుమతి దొరికిందని తెలిసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. భవిష్యత్‌లో మళ్లీ ఇలా జరగదు: తలసాని

ఉస్మానియా ఆస్పత్రిపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు. ఉస్మానియా ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకొని మార్గం చూపించాలన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని నిర్మిద్దామంటే గతంలో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని విమర్శించారు. అప్పుడు ఉస్మానియా, ఇప్పుడు సచివాలయానికి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. కేటీఆర్‌కు ఇంగ్లీషు తప్ప పాలన రాదు: భట్టి

గత నాలుగు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రం భయం గుప్పిట్లో బతుకుతుంటే.. ప్రజలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్‌ ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.ఉన్న అప్పులు సరిపోవడం లేదని, మళ్లీ కొత్త అప్పుల కోసం ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం తీసుకున్నారని మండిపడ్డారు. మంత్రి కేటీఆర్‌కు ఇంగ్లీషు మాటలు తప్ప పరిపాలన మాత్రం రాదని భట్టి విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్

తెలంగాణలో మరో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు మండలలాతో కొత్తగా వేములవాడ రెవెన్యూ డిజవిజన్‌ ఏర్పాటు చేశారు. వేములవాడ, వేములవాడ రూరల్‌, చందుర్తి, బోయిన్‌పల్లి, కోనారావుపేట, రుద్రంగి మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 71 రెవెన్యూ డివిజన్లు ఉండగా తాజగా మరొకటి చేరడంతో మొత్తం సంఖ్య 72కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ట్రంప్‌పై కోర్టుకెళ్లిన ఎన్నారైలు..!

‌అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై ఎన్నారైలు అక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  హెచ్‌1బీ వీసాలను నిలిపివేయడంతో తమను అమెరికాలోకి రానీయకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మొత్తం 174 మంది ట్రంప్‌నకు వ్యతిరేకంగా కోర్టులో కేసును దాఖలు చేశారు.  వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. వారికి పోస్టల్‌ బ్యాలెట్‌.. ఇప్పట్లో లేనట్లే: ఈసీ

పోస్టల్‌ బ్యాలెట్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, ఇతర ఏ ఎన్నికల్లో గానీ ప్రస్తుతానికి 65 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించడం లేదని స్పష్టంచేసింది. దీని అమలు విషయంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు, సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.