ముక్కు ద్వారా కరోనా టీకా..!
close

తాజా వార్తలు

Published : 19/10/2020 11:25 IST

ముక్కు ద్వారా కరోనా టీకా..!

దేశంలో ప్రయోగాలు చేపట్టనున్న భారత్‌ బయోటెక్‌, ఎస్‌ఐఐ

దిల్లీ: కరోనా వైరస్‌ కట్టడి కోసం ముక్కు ద్వారా ఉపయోగించే టీకా‌ చివరిదశ ప్రయోగాలను దేశంలో భారీస్థాయిలో చేపట్టనున్నారు. ప్రాథమిక దశ తర్వాతి దశ ట్రయల్స్‌ను భారత్‌కు చెందిన ఫార్మా సంస్థలు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ చేపట్టనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) త్వరలోనే అనుమతించనుంది. కొద్దినెలల వ్యవధిలోనే దేశంలో ‘ఇంట్రా నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌’ అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆఖరి దశ ప్రయోగాల్లో 30 నుంచి 40 వేల మంది వలెంటీర్లపై ప్రయోగించే అవకాశముందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో దశ వ్యాక్సిన్‌ ప్రయోగాలు‌ అన్నీ ఇంజక్షన్‌ రూపంలో ఉన్నవే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇంట్రానాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలను తాము చేపట్టనున్నట్టు భారత్‌ ప్రకటించడం ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇదిలా ఉండగా రష్యాకి చెందిన కొవిడ్‌-19 వ్యాక్సిన్‌  మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రయోగాలు భారత్‌లో నిర్వహించేందుకు అనుమతులు అభించినట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా కేసులు 75.5 లక్షలకు పైబడిన నేపథ్యంలో.. వాడేందుకు అనువుగా ఉండే నాసల్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రాగలదని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని