close

తాజా వార్తలు

Published : 31/10/2020 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో 6,676కు చేరిన కరోనా మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 84,401 కరోనా పరీక్షలు చేయగా .. 2,886 కొత్త కేసులు నమోదు కాగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,20,565కి చేరింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,676 మంది కొవిడ్‌తో మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 3,623 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,88,375కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,514 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 73,47,776 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

కరోనా బారినపడి రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ముగ్గురు ప్రాణాలో కోల్పోగా.. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడన, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.