50లక్షల కరోనా శాంపిళ్ల పరీక్ష: ఐసీఎంఆర్‌
close

తాజా వార్తలు

Updated : 10/06/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

50లక్షల కరోనా శాంపిళ్ల పరీక్ష: ఐసీఎంఆర్‌

2కోట్ల పరీక్షలతో అమెరికా టాప్‌

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షల పెంపు కూడా అనివార్యమైంది. దీనిలో భాగంగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచింది. ప్రతిరోజు దాదాపు లక్షా 45వేల కొవిడ్‌ నమూనాలకు పరీక్షలు నిర్వహిస్తోంది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 50,61,332 కొవిడ్‌-19 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది.

ఇక భారత్‌లో కొవిడ్‌-19 నిర్ధారణ కోసం ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్‌ పద్దతిని ఐసీఎంఆర్‌ అనుసరిస్తోంది. దీనితోపాటు క్షయవ్యాధి నిర్ధారణకు చేసే ట్రూనాట్‌, సీబీనాట్‌ విధానాన్ని కూడా వినియోగిస్తోంది. దేశంలో ఉన్న 823ల్యాబ్‌ల ద్వారా కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలను ఐసీఎంఆర్‌ జరుపుతోంది. వీటిలో 590 ప్రభుత్వ లాబొరేటరీలు ఉండగా మరో 233 ల్యాబ్‌లు ప్రైవేటుకు చెందినవి ఉన్నాయి. అంతేకాకుండా దేశంలో ఉన్న మొత్తం ల్యాబ్‌లలో దాదాపు 520 ల్యాబ్‌లలో ఆర్‌టీ-పీసీఆర్‌,  240 ల్యాబ్‌లలో ట్రూనాట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరో 63 కేంద్రాల్లో సీబీనాట్‌ పరీక్షలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, దేశంలో బుధవారం ఉదయానికి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,76,583కి చేరగా వీరిలో 7745 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 9985 కేసులు బయటపడ్డాయి.

ఇదిలా ఉంటే, ప్రపంచంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షల్ని అమెరికా నిర్వహిస్తోంది. అమెరికాలో ఇప్పటివరకు రెండు కోట్ల మందికి కరోనా పరీక్షలు జరిపామని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఎక్కువ సంఖ్యలో వైద్య పరీక్షల్ని నిర్వహించినట్లయితే అమెరికా కంటే భారత్‌, చైనాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉంటాయని ట్రంప్‌ చెప్పడం గమనార్హం. రష్యా ఇప్పటివరకు దాదాపు కోటీ ముప్పై లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని