close

తాజా వార్తలు

Updated : 22/10/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజశేఖర్‌ చికిత్సకు స్పందిస్తున్నారు: వైద్యులు

హైదరాబాద్‌: సినీనటుడు రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా కారణంగా రాజశేఖర్‌ తమ ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్న సిటీ న్యూరోసెంటర్‌.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాజశేఖర్‌ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్‌ డైరెక్టర్ రత్నకిశోర్‌ తెలిపారు. 

ఆసుపత్రి నుంచి ప్రకటన వెలువడకముందు ఆయన చిన్న కుమార్తె శివాత్మిక సామాజిక మాధ్యమాల్లో తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ప్రకటన చేసింది. కొవిడ్‌ నుంచి కోలుకునేందుకు నాన్న తీవ్రంగా పోరాటం చేస్తున్నారని పేర్కొంది. కరోనా నుంచి నాన్న వేగంగా కొలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. శివాత్మక ప్రకటనతో రాజశేఖర్‌ ఆరోగ్యంపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మరోమారు  తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని పేర్కొంటూ... రాజశేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని, వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి.. 

వదంతులు నమ్మొద్దు.. స్థిరంగా నాన్న ఆరోగ్యం!



Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని