
తాజా వార్తలు
ఎస్పీబీ ఆరోగ్యం: ఎంజీఎం హెల్త్ బులిటెన్
చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో ఐసీయూలోనే ఉన్నారని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కరోనా పోరాడుతూ ఎస్పీబీ చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇప్పటికీ ఐసీయూలో వెంటిలేటర్‌పై ఎక్మో సాయంతో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నిపుణులైన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఇంటర్నల్ మెడిసన్, క్రిటికల్ కేర్, పల్మనాలజీ, ఇన్ఫెక్టివ్ డీసీజెస్, ఎక్మోకేర్‌లో విభాగాల్లో నిపుణులైన వైద్యులు ఉన్నారు. వీరంతా అంతర్జాతీయస్థాయి వైద్యులతో నిరంతరం అనుసంధానమై ఉంటున్నారు. యూకే, యూఎస్‌లో ఎంతోమంది కరోనా రోగులకు ఎక్మో సాయంతో అక్కడి వైద్యులు చికిత్స చేశారు. ఎస్పీబీ ఆరోగ్యం మెరుగుపడటానికి ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తీసుకుంటున్న చర్యలపై కూడా వారు సంతోషం వ్యక్తం చేశారు.’’ అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- కన్నీటి పర్యంతమైన మోదీ
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
- రెరా మధ్యే మార్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
