close

తాజా వార్తలు

Published : 07/04/2020 09:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: కరోనా ప్రభావంతో గతవారం భారీ నష్టాల్ని మూటగట్టుకున్న మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. మంగళవారం సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల దిశగా సాగుతున్నాయి. అమెరికన్‌ మార్కెట్లు సైతం సోమవారం భారీగా లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు ఐరోపాలో వైరస్‌కు కేంద్రంగా ఉన్న  ఇటలీ, స్పెయిన్‌ సహా మరికొన్ని దేశాల్లో తీవ్రత గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం ఆశలు రేకెత్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1,217 పాయింట్లు లాభపడి 28,818 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 344 పాయింట్లు ఎగబాకి 8,434 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76 వద్ద కొనసాగుతోంది.  

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ఓరియెంట్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, బజాజ్‌ ఫినాన్స్‌ లిమిటెడ్‌, డీసీబీ బ్యాంక్‌, లెమన్‌ ట్రీ హోటల్స్‌, టీసీఎన్‌ఎస్‌ క్లోతింగ్‌ షేర్లు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి.


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని