close

తాజా వార్తలు

Published : 26/09/2020 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యాక్సిన్ వచ్చినా..మరో సవాలు!

కేంద్రాన్ని ప్రశ్నించిన సీరమ్ సంస్థ సీఈఓ

దిల్లీ: కరోనా మహమ్మారి విలయతాండవానికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం ఇప్పుడు అది పెద్ద సవాలని ఇప్పటికే చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది క్లిష్టమైన వ్యవహారంగా మారనుంది. దీన్ని ఉద్దేశించి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా ప్రభుత్వానికి ఓ ప్రశ్నను సంధించారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి వచ్చే సంవత్సర కాలానికి కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చుచేయగలదా?అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్‌ చేశారు. 

‘క్విక్‌ క్వశ్చన్‌: వచ్చే ఏడాది కాలంలో భారత ప్రభుత్వానికి రూ.80వేల కోట్లు లభిస్తాయా? భారత్‌లోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్‌ను అందించాలంటే దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి కేంద్రానికి అవసరమైన మొత్తమిది. మనం పరిష్కరించాల్సిన తదుపరి సవాలు ఇది’ అని అదర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం కోసం సీరమ్ సంస్థ ఇప్పటికే ఆస్ట్రాజెనికా, నోవాగ్జిన్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంకా ఆ రెండు వ్యాక్సిన్లు ప్రయోగదశలోనే ఉన్నాయి. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని