కరోనా ముప్పు..  ఈ జాగ్రత్తలు పాటించండి..!
close

తాజా వార్తలు

Updated : 29/01/2020 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ముప్పు..  ఈ జాగ్రత్తలు పాటించండి..!

హైదరాబాద్‌: చైనాలో వెలుగుచూసిన కొత్త రకం వైరస్‌ కరోనా.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భారత్‌ పొరుగుదేశాలైన నేపాల్‌, శ్రీలంకలో ఇప్పటికే అధికారికంగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి ఈ వైరస్‌ ఎక్కడ దేశంలో వ్యాప్తి చెందుతుందోనని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. విమానాశ్రయాల్లో ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి థర్మల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానుతుల్ని ఆస్పత్రులకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. కేరళలో ఏకంగా కొంతమందిని ఇంటికే పరిమితం చేశారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కలకలం సృష్టిస్తోంది. ఫీవర్‌, గాంధీ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేసింది..... 

* జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చాతిలో నొప్పి మొదలైన లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని వైద్యులను సంప్రదించాలి. 

* గర్భవతులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

* వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి.

* సాధ్యమైనంత వరకు దూరప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి.

* పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి.

* జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వీలైనంత వరకు వెళ్లొద్దు.

* దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు లేదా టవల్‌ ముక్కుకు, నోటికి అడ్డంగా పెట్టుకోవాలి లేదా మాస్క్‌ ధరించాలి. 

డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు..

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక్క కరోనా వైరస్ కేసు కూడా అధికారికంగా నమోదు కాలేదు. అయినప్పటికీ దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, కేరళలో పలువురు అనుమానితుల్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) సైతం ఎప్పటికప్పుడు ఈ వైరస్ వ్యాప్తిని సమీక్షిస్తోంది. ప్రభుత్వాలకు అవసరమైన మార్గదర్శకాలను జారీ చేస్తోంది. చైనాలో ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 131 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన జాగ్రత్తల కోసం క్లిక్‌ చేయండి..

వీలైనంత త్వరగా గుర్తించడమే ఏకైక మార్గం..

మరో పది రోజుల్లో ఈ వైరస్‌ తీవ్రరూపం దాల్చి మృతులు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చైనా ఆరోగ్య రంగ నిపుణుడు ఝోంగ్‌ నాన్‌షన్‌ హెచ్చరించారు. బాధితుల్ని వీలైనంత త్వరగా గుర్తించి వారిని దూరంగా ఉంచడమే ప్రస్తుతానికి వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉన్న ఏకైక మార్గమని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల కమిటీకి ఝోంగ్‌ నేతృత్వం వహిస్తున్నారు. జ్వరం, బలహీనంగా మారడమే వైరస్‌ సోకిన వారిలో కనిపిస్తున్న ప్రముఖ లక్షణాలని తెలిపారు. ఏమాత్రం అనుమానం ఉన్నా.. వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు.

ఇవీ చదవండి..

పదిరోజుల్లో కరోనా మరింత తీవ్రరూపం?

పిశాచంతో పోరాడుతున్నాం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని