close

తాజా వార్తలు

Published : 28/09/2020 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఏ చలీ వణికించలేదు!

తూర్పు లద్దాఖ్‌లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. ఎముకలు కొరికే చలికి సైతం తమను కదిలించే దమ్ము లేదని చాటేందుకు సిద్ధమైంది. శీతాకాలం ఆరంభం కాగానే భారత సేన వెనుదిరుగుతుందన్న డ్రాగన్‌ అపోహలను పటాపంచలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇందుకోసం మన బలగాలు చేపట్టిన అతిపెద్ద సైనిక సరఫరా ఆపరేషన్‌ దాదాపుగా పూర్తికావొస్తోంది. ఇందులో భాగంగా భారీ ట్యాంకులు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి, ఇంధనం, ఆహారం, శీతాకాల నిత్యావసరాలు ఎత్తయిన ప్రాంతాలకు తరలివెళ్లాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హేమంత్‌ హత్య కేసులో మలుపు!

ప్రేమించి పెళ్లిచేసుకుని హత్యకు గురైన హేమంత్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ కేసులో హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గొంతుకు తాడు బిగించడం వల్లే హేమంత్‌ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌కు పాలనపై అవగాహన లేదు

‘సీఎం జగన్‌కు పాలనపై అవగాహన లేదు.. ఒక్క ప్రాజెక్టూ చేపట్టలేదు, వచ్చినప్పటి నుంచి రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏల రద్దు తదితర అవగాహనారాహిత్యమైన పనులు తప్పితే రాష్ట్రానికి ఉపయోగపడేదేం చేయలేదు’ అని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎస్సీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా కేసులు పెట్టే పరిస్థితి లేదని విమర్శించారు. ‘వైకాపా, తెలుగుదేశం పార్టీలు రెండూ మాకు రాజకీయ శత్రువులే. ఆ నేతలిద్దరూ కాంగ్రెస్‌ అవినీతి వటవృక్షం నుంచి మొలకెత్తినవారే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తినడం సరే.. కొనడం ఎలా!

 కరోనా బారిన పడకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజువారీగా మన కంచంలో ఏయే పోషకాలు, ఎంతెంత మోతాదులో ఉండేలా చూసుకోవాలో వివరిస్తూ ఇటీవల భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. అంతవరకు బాగానే ఉన్నా నిత్యావసర సరకుల ధరలు మండిపోతున్న ప్రస్తుత తరుణంలో పేదలు ఖరీదైన ఆహార పదార్థాలను కొనుక్కోవడం సాధ్యమేనా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సమయం తినే ప్రశ్నలే అధికం

లక్షలాది మంది కలల పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆదివారం ముగిసింది. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలో ఈసారి అధిక సమయం తీసుకునే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. పేపర్‌-2 ప్రశ్నలు సులభంగా ఉన్నా.. పూర్ణాంకాలు(ఇంటిజర్‌), సాంఖ్యాత్మక విలువ(న్యూమరికల్‌...పాయింట్లలో) జవాబులు ఉన్న ప్రశ్నలు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ సమయం తిన్నాయి. దాంతో అత్యధిక శాతం మంది 3 గంటల్లో అన్నింటికీ జవాబులు గుర్తించడం కష్టమని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అరచేతిలో ప్రాణం.. అరికాలి కింద అఖాతం!

ఈ చిత్రం ఒడిశా రాష్ట్రం కొంధమాల్‌ జిల్లా కె.నువాగాం సమితి గంజిబాడి గ్రామ పంచాయతీ బిరిండాపొడా గ్రామంలోనిది. 100కు పైగా కుటుంబాలున్న ఈ గ్రామానికి బాహ్యప్రపంచంతో రాకపోకలు సాగించాలంటే ఒంటి తీగ వంతెనే ఆధారం. పిల్లలు బడికి వెళ్లాలన్నా, ప్రజలు నిత్యావసరాలు, పింఛన్లు, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కళిపెను నది దాటి వెళ్లాలి. దీనిపై వంతెన నిర్మించాలని గ్రామస్థులు ఎన్నోసార్లు అధికారులు, నాయకులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అతడిని మరిచిపోలేకపోతోంది!

నా స్నేహితురాలు ఓ అబ్బాయిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందానుకున్నారు. కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి నా ఫ్రెండ్‌ బాగా కుంగిపోతోంది. ఉద్యోగానికి వెళ్లబుద్ధికావడం లేదంటోంది. ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయమేస్తోంది. తనకు ఉద్యోగం చాలా అవసరం. ఇంట్లోవాళ్లు తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను ఎన్ని రకాలుగా చెప్పినా ఏడుస్తోందే తప్ప తనలో మార్పు కనపించడం లేదు. తనను ఎలా మార్చాలి? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కొవిడ్‌ను అడ్డుకునే... క్యాట్‌ డ్రగ్‌!

పిల్లుల్లో ‘సార్స్‌’ దుష్ప్రభావాలను విజయవంతంగా నియంత్రించే ఓ ఔషధం... మనుషుల్లో కొవిడ్‌-19 చికిత్సలోనూ సమర్థంగా, సురక్షితంగా ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ‘జీసీ376’ అనే ఔషధం పిల్లుల్లో సార్స్‌ ప్రబలకుండా అడ్డుకుంటుంది. 2003లోనే దీనిపై అనేక పరిశోధనలు జరిగాయి. మార్జాలాల్లో ఈ వైరస్‌ను నిలువరించి, ఇన్‌ఫెక్షన్‌ బారి నుంచి వాటిని కాపాడేలా జంతు వైద్య నిపుణులు అప్పట్లో దీన్ని అభివృద్ధి చేశారు. కొవిడ్‌-19 నేపథ్యంలో- కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లెమీక్స్‌ బృందం ఇటీవల మరోమారు ఈ ఔషధంపై అధ్యయనం సాగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ మధ్య మళ్లీ ఘర్షణ

ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. వివాదాస్పద ‘నాగొర్నో-కరాబాఖ్‌’ ప్రాంతంలో ఇరు దేశాల బలగాలు ఆదివారం పరస్పరం ఘర్షణ పడ్డాయి. ఈ ఘర్షణలో 16 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికిపైగా గాయపడ్డారు. ‘నాగొర్నో-కరాబాఖ్‌’ అనేది పర్వతాలతో కూడిన ప్రాంతం. దాని విస్తీర్ణం 4,400 చదరపు కిలోమీటర్లు. భౌగోళికంగా అది అజర్‌బైజాన్‌లో ఉంది. అయితే- 1994 నుంచి దానిపై పూర్తి నియంత్రణ ఆర్మేనియా మద్దతుతో కూడిన బలగాలదే. తాజా ఘర్షణలో తాము అజర్‌బైజాన్‌కు చెందిన రెండు హెలికాప్టర్లను కూల్చివేశామని ఆర్మేనియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 223.. చాల్లేదు

నిజంగా పరుగుల తుఫానే..! మయాంక్‌ కళ్లు చెదిరే శతకం (45 బంతుల్లో) చిన్నబోయింది. రాజస్థాన్‌ 223 పరుగుల స్కోరు సైతం చాల్లేదు. అది ఊహకందని ఉతుకుడు. అది నమ్మశక్యంకాని బాదుడు. రాజస్థాన్‌ అద్భుతమే చేసింది. అసాధ్యం అనుకున్న ఛేదనను మరో మూడు బంతులు ఉండగానే పూర్తి చేసి ఔరా అనిపించింది. సంజు శాంసన్‌, స్మిత్‌ వీర విధ్వంసానికి.. అనామకుడనుకున్న తెవాతియా అద్భుత హిట్టింగ్‌ తోడవడంతో కొండంత లక్ష్యాన్ని సైతం రాయల్స్‌ పిండి చేసింది.ఈ సీజన్‌ రేసును రసవత్తరంగా మార్చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. తెవాతియా ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు కొట్టేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.