కరోనాతో యూపీ మంత్రి మృతి
close

తాజా వార్తలు

Published : 02/08/2020 12:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో యూపీ మంత్రి మృతి

లఖ్‌నవూ: కరోనా మహమ్మారి సోకడంతో ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ మంత్రి కమల్‌రాణి వరుణ్‌(62) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా లఖ్‌నవూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కరోనా నిర్ధారణ కావడంతో జులై 18న ఆమెను రాజధాని కొవిడ్‌ ఆస్పత్రిలో చేర్చారు. ‘‘ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ పెరిగిపోవడంతో మంత్రి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దీంతో ఆమెను లైఫ్‌ సపోర్ట్‌ సిస్టంపై ఉంచాం. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఆమెని కాపాడలేకపోయాం’’ అని వైద్యులు తెలిపారు. కమల్‌రాణి కాన్పూర్‌ జిల్లాలోని ఘాటమ్‌పూర్‌ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  

ఆమె మృతిపట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆగస్టు 5న జరగనున్న రామమందిర భూమి పూజ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి నేడు ఆయన అయోధ్యకు వెళ్లాల్సి ఉంది. కానీ, మంత్రి మరణవార్తతో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని