యూపీలో 2022లోనూ ఇదే జోరు: యోగి
close

తాజా వార్తలు

Published : 11/11/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో 2022లోనూ ఇదే జోరు: యోగి

లఖ్‌నవూ: యూపీ ఉపఎన్నికల్లో భాజపా మంచి జోరు కనబరిచిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. ప్రస్తుతం ఉన్న జోరే 2022 ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు యోగి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘యూపీ ఉపఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు కనబర్చింది. భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు నా తరఫున అభినందనలు. రాష్ట్రంలో భాజపా 2017 అసెంబ్లీ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో చూపిన జోరునే ఇప్పుడు ఉపఎన్నికల్లోనూ కొనసాగించింది. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోరు కొనసాగుతుంది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తోందనడానికి ఈ ఫలితాలు చాలు. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన బూత్‌ స్థాయి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు. బిహార్‌లో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మోదీ ఉంటే భద్రత(మోదీ హైతో ముంకిన్‌ హై) అని బిహార్‌ సహా ఉపఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లోనూ ప్రజలు నిరూపించారు.

యూపీలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా ఆ ఏడింటికి గానూ ఆరు స్థానాల్లో భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. మిగతా ఒక స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ లీడింగ్‌లో ఉందని ఈసీ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని