పోలీసుల ముందుచూపు.. లేకుంటే మరో ‘మర్కజ్‌’
close

తాజా వార్తలు

Published : 03/04/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పోలీసుల ముందుచూపు.. లేకుంటే మరో ‘మర్కజ్‌’

ముంబయి: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంది. గత రెండు రోజులుగా ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా నిజాముద్దీన్‌లో జరిగిన ‘మర్కజ్‌’కు హాజరైన వారిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండడంతో కలకలం రేగింది. విదేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తబ్లిగీకి హాజరయ్యారు. విదేశీయుల నుంచి ఈ వైరస్‌ భారతీయులకు సోకింది. అయితే నిజాముద్దీన్‌ సభ లాంటిదే ముంబయి సమీపంలో వాసైలో మార్చి 14న ఏర్పాటు చేయడానికి తబ్లిగీ జమాత్‌ సంఘం వారు పాల్గర్‌ పోలీసు యంత్రాంగాన్ని జనవరిలో అనుమతి కోరారు. వారు అనుమతి కూడా ఇచ్చారు. అయితే మార్చిలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ ప్రాంత ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ అయిన కొంకణ్‌ రాంజే, నికేత్‌ కౌషిక్‌ అప్రమత్తయ్యారు.

పాల్గర్‌ జిల్లా ఎస్పీ గౌరవ్‌సింగ్‌తో భేటీ అయ్యి రానున్న రోజుల్లో జరగబోయే సామూహిక కార్యక్రమాల గురించి ఆరా తీశారు. విదేశాల నుంచి వేల సంఖ్యలో తబ్లిగీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో మర్కజ్‌ కార్యక్రమానికి వెంటనే అనుమతిని రద్దు చేశారు. ప్రస్తుతం దిల్లీ నిజాముద్దీన్‌ సభలో ఏర్పడిన ఈ పరిణామాన్ని తలచుకుని నాడు అనుమతి నిరాకరించడం ఒక తెలివైన చర్యగా మహారాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. లేకుంటే నిజాముద్దీన్‌ కంటే భారీస్థాయిలో ఇక్కడి మర్కజ్‌ జరిగి ఉండేదని అనుకుంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1965 కరోనా పాజిటివ్‌ కేసులు కాగా, 50 మంది మృత్యువాత పడ్డారు. 150 మంది ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని