close

తాజా వార్తలు

Published : 05/03/2021 11:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బంద్‌లో పాల్గొని..వ్యాఖ్యాతగా విజయసాయిరెడ్డి

విశాఖపట్నం: స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. విశాఖపట్నం మద్దిలపాలెం కూడలిలో నిర్వహించిన మానవహారంలో రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్‌, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మైక్‌ పట్టుకుని వ్యాఖ్యాత(యాంకర్‌)గా వ్యవహరించారు. మానవహారంలో పాల్గొన్న వామపక్షాల నేతలతో.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై మాట్లాడించారు. భాజపా, జనసేన మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ప్రజారవాణా స్తంభించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని