close

తాజా వార్తలు

Published : 28/02/2021 17:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేశంలో భాజపా హవా పడిపోయింది: నారాయణ

హైదరాబాద్‌: దేశంలో భాజపా హవా పడిపోయిందని.. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ప్రధాని మోదీ అనేక అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్‌కు గంట ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయతీలు ఎలా ప్రకటిస్తాయని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేస్తామని ప్రధాని పేర్కొనడం సరికాదన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతోందని నారాయణ ఆరోపించారు. సీఎం కేసీఆర్‌.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారని ఆక్షేపించారు. ఆయన పేరుతో గెలిచే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఉనికే లేదన్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని