Health Emergency ప్రకటించండి..!
close

తాజా వార్తలు

Updated : 18/04/2021 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Health Emergency ప్రకటించండి..!

ప్రధానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ విజ్ఞప్తి

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ తీవ్రరూపం దాల్చడంతో దేశంలో ఆరోగ్య అత్యయికస్థితిని ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కొవిడ్‌ విస్తృతి దృష్ట్యా ఎన్నికల ర్యాలీలపైనా తాత్కాలికంగా నిషేధం విధించాలని అయన ఎన్నికల సంఘానికి సూచించారు.

‘కరోనా కేసుల్లో కోలుకుంటున్న వారికంటే కొత్త కేసులే అధికంగా ఉంటున్నాయి. మోదీజీ..హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించండి. ఎన్నికల ప్రచార ర్యాలీలపైనా ఎన్నికల సంఘం తాత్కాలిక నిషేధాన్ని విధించాలి. న్యాయస్థానాలు ప్రజల ప్రాణాలను రక్షించాలి’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రధానిపై చిదంబరం విమర్శలు..

బెంగాల్‌లో గెలుపునకు తీవ్ర కృషి చేస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ పరిస్థితిపై సమీక్షించేందుకు కొంత సమయం కేటాయించడం పట్ల కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ధన్యవాదాలు తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్‌, ఔషధాలు, ఆక్సిజన్‌ కొరత ఉన్నట్లు చాలా రాష్ట్రాలు మొరపెట్టుకుంటున్నప్పటికీ..కేంద్రం మాత్రం అలాంటి కొరత లేదని చెప్పడంపైనా విమర్శలు గుప్పించారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా, దీదీ-ఓ-దీదీ అంటూ ప్రధాని వ్యాఖ్యానించడాన్ని పీ చిదంబరం తప్పుబట్టారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఓ ముఖ్యమంత్రిని ఇలాగే సంబోధిస్తారా? అని ప్రశ్నించారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ ఊహించని రీతిలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. నిత్యం 2లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2లక్షల 61వేల కేసులు, 1501 మరణాలు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో క్రియాశీల కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ రోగులతో ఆసుప్రతులు నిండిపోతుండడం, ఆక్సిజన్‌ కొరత వంటి పరిస్థితులతో ఆరోగ్య వ్యవస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని