ఆక్సిజన్‌ లీకై సరఫరా నిలిచి 22మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 16:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ లీకై సరఫరా నిలిచి 22మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

ముంబయి: మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి బయట ఆక్సిజన్‌ ట్యాంకర్‌ లీక్‌ అవడంతో.. రోగులకు ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. దీంతో 22 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్‌లోని జాకీర్‌ హుస్సేన్‌ మున్సిపల్‌ ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

ఈ ఆసుపత్రిలో అనేక మంది కరోనా రోగులు చికిత్స తీసుకుంటున్నారు. దాదాపు 150 మంది రోగులు వెంటిలేటర్‌పై, ఆక్సిజన్‌ సరఫరాపై ఆధారపడి ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రి బయట ఆక్సిజన్‌ ట్యాంకర్‌లో ప్రాణవాయువు నింపుతుండగా ట్యాంకర్‌ లీకైంది. దీంతో దాదాపు 30 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో వెంటిలేటర్‌పై ఉన్న 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రి రాజేశ్ తోపే తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించారు. 

ట్యాంకర్‌ లీకవడంతో గ్యాస్‌ ఒక్కసారిగా బయటికొచ్చి కమ్మేసింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని ఆక్సిజన్‌ లీక్‌ను నియంత్రించారు. ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అవసరమైన మరో 30 మందిని వెంటనే వేరే ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఎన్సీపీ నేత మజీబ్‌ మేమన్‌ డిమాండ్‌ చేశారు.

ఇదో భయానకమైన ఘటన.. 
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందిస్తూ.. ఇదో భయానకమైన ఘటనగా పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులను వెంటనే ఇతర ఆసుపత్రులకు త
రలించాలని కోరారు. ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని