హెపటైటీస్‌ వైరస్‌ నిర్మూలనే లక్ష్యం! 
close

తాజా వార్తలు

Updated : 31/12/2020 23:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హెపటైటీస్‌ వైరస్‌ నిర్మూలనే లక్ష్యం! 

 

 


ఇంటర్నెట్‌ డెస్క్‌ : అత్యంత ప్రమాదకరమైన కాలేయ సంబంధ వ్యాధులకు కారణమవుతున్న హెపటైటిస్‌ వైరస్‌ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హరియాణాలో ప్రయోగం విజయవంతం కావటంతో అన్ని రాష్ట్రాల్లోనూ చికిత్సను ప్రారంభించింది. రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాల పరిధిలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందించటానికి తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్సా కేంద్రం ప్రారంభించారు.

2030 నాటికి కాలేయ వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నేషనల్ వైరల్ హెపటైటిస్‌ కంట్రోల్ ప్రోగ్రామ్ పేరుతో రోగులకు వ్యాధి నయం చేయటమే లక్ష్యంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిల్లో మోడల్‌ ట్రీట్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రుయా ఆసుపత్రిలో ప్రతీ మంగళ, గురువారాల్లో రోగులకు ఓపీ సేవలు అందిస్తున్నారు.

నేషనల్ వైరల్ హెపటైటిస్‌ కంట్రోల్‌ కార్యక్రమం ద్వారా రోగులకు ఖరీదైన ఔషధాలు, వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా లభించనున్నాయి. హెపటైటిస్‌ను ప్రారంభంలోనే గుర్తించకపోతే రోగుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. కేవలం మూడు నెలల వైద్యంతో హెపటైటిస్‌ సీ పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు అవుతున్న ఈ పథకం ద్వారా హెపటైటిస్‌ రోగులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని