close
Array ( ) 1

తాజా వార్తలు

శ్వాసకు భరోసా!

ఇంటిల్లిపాదీ వ్యాధినిరోధకశక్తిని పెంచే బాధ్యత అమ్మగా మనమీదే ఉంటుంది..

మందుల కంటే మనోధైర్యం గొప్పది. ఆ మనోధైర్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని అందించే ఈ యోగాసనాల గురించి కాస్త తెలుసుకోండి! ఇంట్లో వారికీ అవగాహన కల్పించండి....

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్లు, జలుబు, తలనొప్పి, దగ్గు.. లాంటి సమస్యల నివారణకు ఈ ముద్రలు చాలా మంచివి. వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా వీటిని సాధన చేయొచ్చు.


భస్త్రికా ప్రాణాయామం

ముక్కు రెండు రంధ్రాలతో శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. రెండూ సమానంగా ఉండాలి. ఇలా ఇరవైసార్లు చేసి ఆగి, మళ్లీ చేయాలి. శ్వాస తీసుకునేటప్పుడు మోచేతులు పైకి, వదిలేటప్పుడు కిందికి రావాలి.
* ఈ రెండూ చేసిన తర్వాత కొంచెం సేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
* చేతులను పటికతో కడుక్కుంటే ఎలాంటి వైరస్‌లూ దరిచేరవు.  


కపాలభాతి

శ్వాసను వదిలేటప్పుడు ముక్కుతోనే వదలాలి. సెకనుకు ఒకసారి వదలాలి. ఇలా పది లేదా ఇరవైసార్లు చేసి విశ్రాంతి తీసుకోవచ్చు. అలసిపోతే మధ్యలో కాసేపు ఆగి మళ్లీ చేయాలి. వందసార్లు చేయాలి.


లింగముద్ర

రెండు చేతుల వేళ్లనూ ఒకదానితో ఒకటి పట్టుకోవాలి. బొటనవేలు ఆకాశం వైపు కనిపించేలా పెట్టాలి. మగవాళ్లు కుడిచేతి బొటనవేలు, ఆడవాళ్లు ఎడమచేతి బొటనవేలు పైకి పెట్టాలి. రోజూ పది నిమిషాల చొప్పున మూడుసార్లు చేయాలి. శ్వాస మీదే ధ్యాస పెట్టాలి. ఇది వేసేటప్పుడు ప్రాణశక్తిని మీ ఊపిరితిత్తులకు పంపుతున్నట్టూ, ఇబ్బందులను శ్వాసతో పాటు బయటికి పంపుతున్నట్టూ ఊహించుకోవాలి. శరీరానికి మోచేతులు దూరంగా ఉంచాలి. వెన్నెముక నిటారుగా పెట్టి సాధన చేయాలి.  
* వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఈ ముద్ర మంచిది.


శ్వాసముద్ర

రెండు చేతులతో చేయాలి. చిటికెన వేలుని బొటనవేలు మొదట్లో ఉంచాలి. బొటనవేలు మధ్య భాగంలో ఉంగరం వేలు ఉంచాలి. మధ్యవేలు బొటనవేలి చివరన కలపాలి. చూపుడువేలును తిన్నగా చాచి పైకి పెట్టాలి.
* శ్వాసకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నాలుగు నిమిషాలు వేసి, కొంచెం విరామం ఇచ్చి మళ్లీ నాలుగు నిమిషాలు వేయాలి. మొత్తం ఎనిమిది నిమిషాలు సాధన చేయాలి. అన్ని వయసుల వాళ్లూ ఈ రెండు ముద్రలూ వేయొచ్చు.
* గొంతు పొడారిపోకుండా చేస్తుంది. ఊపిరితిత్తులకు చాలా మంచిది. త్వరగా జలుబు చేసేవాళ్లకు, ఆయాసం ఉన్నవాళ్లకు ఉపయోగపడుతుంది. ఈ ముద్రలతోపాటు కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామం చేయాలి.

- అరుణ, యోగా నిపుణురాలు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.