close

తాజా వార్తలు

Published : 27/05/2020 23:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పంచాయతీ’ రంగుల మార్పుపై రేపే విచారణ

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీ, గ్రామసచివాలయ భవనాలకు రంగుల మార్పు జీవోపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇటీవల పంచాయతీ, గ్రామసచివాలయ భవనాలకు వేసిన అధికార పార్టీ రంగులను మార్చాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది. జస్టిస్‌ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసు విచారణ చేపట్టనుంది. అయితే ఈ విషయంలో గతంలో కూడా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కాషాయరంగు వేస్తే ఒప్పుకుంటారా అని ధర్మాసనం ప్రశ్నించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.