
తాజా వార్తలు
మద్యం.. అతివేగం.. బలిగొంది ప్రాణం
ప్రమాదానికి గురైన కారు
వనస్థలిపురం, న్యూస్‌టుడే: ఇబ్రహీంపట్నం పరిధి కర్ణగూడకు చెందిన నల్లబోలు సందీప్‌రెడ్డి(29) సాఫ్ట్వేర్ ఉద్యోగి. చంపాపేటలో ఉంటున్నాడు. ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్, తుర్కయాంజాల్‌కు చెందిన గౌతమ్ అతనికి స్నేహితులు. శుక్రవారం రాత్రి ఇద్దరూ సందీప్‌రెడ్డి ఇంటికెళ్లారు. మద్యం తాగారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటలకు మల్లికార్జున్ తన కారును గౌతమ్‌కు ఇచ్చి పక్కన కూర్చున్నాడు. సందీప్‌రెడ్డి వెనుక కూర్చున్నాడు. కారు బీఎన్‌రెడ్డినగర్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పింది. గౌతమ్ మలుపు తిప్పేందుకు యత్నించడంతో నేరుగా వేళ్లి సిగ్నల్ స్తంభాన్ని, తర్వాత విభాగినిని ఢీకొట్టి ఆగిపోయింది. బెలూన్లు తెరుచుకోవడంతో గౌతమ్, మల్లికార్జున్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. సందీప్‌రెడ్డి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మల్లికార్జున్ పరారయ్యాడు. గౌతమ్‌ను వనస్థలిపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. గౌతమ్‌పై, అతన్ని ప్రోత్సహించిన మల్లికార్జున్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.